కేంద్ర హోంమంత్రి బండి సంజయ్‌కు ప్రైవేట్ సెక్రటరీ (పీఎస్)గా ఐఏఎస్ అధికారి ఆంధ్రవంశీ నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. సంజయ్‌కు వంశీ ఐదేళ్లపాటు పీఎస్‌గా ఉంటారని కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లోని ఒంగోలుకు చెందిన వంశీ 2011 నుంచి ఉత్తరప్రదేశ్ క్యాడర్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన సమయంలోనే సమర్థ అధికారిగా పేరు తెచ్చుకున్నారు.

యూపీలోని మధుర, ప్రయాగ్‌రాజ్, ఝాన్సీ, పిలిభిత్, షాజహాన్‌పూర్ తదితర జిల్లాల్లో కలెక్టర్‌గా పనిచేశారు. తర్వాత లక్నోలోని స్కిల్ డెవలప్‌మెంట్ మిషన్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2006లో హైదరాబాద్‌లోని జేఎన్‌టీయూలో కంప్యూటర్ సైన్స్‌లో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసి సివిల్స్‌కు ప్రిపేర్ అయ్యాడు. 2011లో ఐఏఎస్‌ అధికారి అయ్యారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *