హైదరాబాద్ నగర వాసుల ట్రాఫిక్ కష్టాలు తీరనున్నాయి. నగరంలో రెండో అతిపెద్ద ఫ్లై ఓవర్ నేటి నుంచి అందుబాటులోకి రానుంది. రూ.800 కోట్లతో నిర్మించిన ఆరాంఘర్ నుంచి జూపార్క్ వరకు 4.08 పార్ల పొడవున్న ఫ్లైఓవర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఈ రోజు సాయంత్రం 4 గంటలకు ప్రారంభించనున్నారు.
వాస్తవానికి గతేడాది డిసెంబర్‌లో ఈ ఫ్లైఓవర్ ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేశారు. అయితే ఒకవైపు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్, మరోవైపు ఎంపీ అసదుద్దీన్ తమ పరిధిలోనే కార్యక్రమాన్ని నిర్వహించాలని పట్టుబట్టడంతో ప్రారంభోత్సవ వేడుక వాయిదా పడినట్లు ప్రచారం జరుగుతోంది.