ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంది. ఈ హామీలో భాగంగా ఏపీలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగలోపు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పిస్తామని తెలిపారు. సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఇప్పటికే పెన్షన్లను పెంచామని, ఈరోజు నుంచి దీపం పథకం ప్రారంభిస్తున్నామని స్పష్టం చేశారు.
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు మహిళలకు త్వరలో ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కూడా కల్పిస్తామన్నారు. రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పెంచేందుకు ఎన్నో పరిశ్రమలు తీసుకువస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రభుత్వం పై జగన్ కు అర్హత లేదని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా కూడా లేని జగన్ ఎన్ని మాటలు చెప్పినా ప్రజలు నమ్మరు అని ఆయన తెలిపారు.