తిరుపతి వైకుంఠ ద్వార దర్శనం టికెట్ల జారీ కేంద్రం వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు భక్తులు మృతి చెందిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఘటనా స్థలాన్ని సీఎం చంద్రబాబు సందర్శించారు. ఏం అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు? అంటూ టీటీడీ ఈఓ, ఇతర అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజయవాడ నుంచి తిరుపతికి బయలుదేరారు. తిరుపతిలో తొక్కిసలాట జరిగిన ప్రదేశాన్ని పరిశీలించనున్నారు. తొక్కిసలాటలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని పవన్ పరామర్శించనున్నారు.