ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన రేపు కేబినెట్ సమావేశం జరగనుంది. రేపు ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభమవుతుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ముఖ్యంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకంపై చర్చించనున్నారు. దీంతో పాటు పలు సంక్షేమ పథకాలపై కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు బనకచర్ల ప్రాజెక్టుపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ అంశంపై కూడా కేబినెట్‌ సమావేశంలో చర్చించనున్నారు.

రైతు భరోసా హామీలు, వివిధ కంపెనీలకు భూ కేటాయింపులు, గీత కార్మికులకు 10 శాతం వైన్ షాపుల కేటాయింపు తదితర అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. కేబినెట్ సమావేశం అనంతరం మంత్రులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా తాజా రాజకీయ పరిణామాలు, పాలనాపరమైన అంశాలపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *