కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇచ్చిన హామీలను వరుసగా అమలు చేస్కుంటూ వస్తుంది. ఎన్నికల సమయంలో అన్న క్యాంటీన్ తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ ప్రకారంగా అన్న క్యాంటీన్ ఆగష్టు 15 న ప్రారంభించారు. ఆకలితో అలమటించే పేదలకు రూ.15 రూపాయలకే మూడు పూటలా ఆహారం అందించే బృహత్తరమైన కార్యక్రమం ‘అన్న క్యాంటీన్’ పథకమని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గుడివాడలో అన్న క్యాంటీన్‌ను ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. కాగా ఈ క్యాంటీన్ల ద్వారా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, రాత్రి డిన్నర్‌ లభించనుంది. ఆదివారం క్యాంటీన్‌కు సెలవు ఉంటుంది అని పేర్కొన్నారు.

అన్న క్యాంటీన్ మెనూ:

సోమవారం – బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ ,చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
మంగళవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ, చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
బుధవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
గురువారం– బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పూరి, కుర్మా ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
శుక్రవారం-బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా ఉప్మా,చట్నీ/పొడి, సాంబార్, మిక్చర్; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.
శనివారం– బ్రేక్ ఫాస్ట్ : ఇడ్లీ చట్నీ/పొడి, సాంబార్ లేదా పొంగల్, చట్నీ/పొడి, సాంబార్ ; లంచ్/డిన్నర్ : వైట్ రైస్, కూర, పప్పు/సాంబార్, పెరుగు, పచ్చడి.

.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *