ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్టం ప్రభుత్వం నూతన కార్యక్రమాలకు కసరత్తు చేస్తుంది. గతంలో టీడీపీ హయంలో రూపుదిద్దుకున్న అన్నా క్యాంటీన్లను జగన్ సర్కార్ రాష్ట్రంలో కొలువుదీరాక నిలిపివేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడడంతో అన్నా క్యాంటిన్లను తిరిగి అందుబాటులోకి తెస్తున్నారు. ఎన్నికలో సమయంలో అన్న కాంటీన్లు తిరిగి ప్రారంభిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. భారీ స్థాయిలో ఆగస్టు 15వ తేదీన రాష్ట్రంలో 100 అన్న క్యాంటీన్లు ప్రారంభించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. “33 మున్సిపాలిటీల్లో 100 క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నాం. రాబోయే వారం రోజులు అన్న క్యాంటీన్లపై కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి అని ఆదేశించారు. క్యాంటీన్ భవనాల్లో కిచెన్ ఏర్పాటు చేసే బృందంతో సమన్వయం చేసుకోవాలి” అని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో మంత్రి నారాయణ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అనిల్ కుమార్ సింఘాల్, డైరెక్టర్ హరి నారాయణన్, ఉన్నతాధికారులు వీడియో కాన్ఫరెన్స్కు హాజరయ్యారు. అన్న క్యాంటీన్ల ఏర్పాటు, డ్రైన్లలో పూడిక తొలగింపుపై సూచనలు చేశారు. వివిధ ప్రాంతాల్లో క్యాంటీన్ భవనాల నిర్మాణం జరుగుతున్న తీరును పరిశీలించారు. అతి తక్కువ ధరలకే ఆహార పదార్దములు అదించాలని నిర్యాయించారు. ఉదయం టిఫిన్ రూ 5, మధ్నాహ్న భోజనం రూ 5, రాత్రికి భోజనం రూ 5 చొప్పున అందరికి అందించాలని నిర్ణయించారు.