ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర అభివృద్ధి కోసం కూటమి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణంపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఆరు చోట్ల కొత్త ఎయిర్ పోర్టుల నిర్మాణానికి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఆ మేరకు నిధులు కూడా కేటాయించింది. ఫీజిబిలిటీ అధ్యయనం కోసం ప్రభుత్వం రూ.1.92 కోట్లు విడుదల చేసింది.
కుప్పం, శ్రీకాకుళం (పలాస), నాగార్జునసాగర్ (సమీపంలో), ఒంగోలు, తాడేపల్లిగూడెం, తుని-అన్నవరం ప్రాంతాల్లో ఎయిర్ పోర్టులు నిర్మించాలని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. అందుకోసం కుప్పంలో 1,501 ఎకరాలు, నాగార్జునసాగర్ సమీపంలో 1,670 ఎకరాలు, తాడేపల్లిగూడెం వద్ద 1,123 ఎకరాలు, శ్రీకాకుళం జిల్లా పలాస వద్ద 1,383 ఎకరాలు, ఒంగోలులో 657 ఎకరాలు, తుని-అన్నవరంలో 787 ఎకరాల భూమిని ప్రభుత్వం గుర్తించింది .ఏపీ ఎయిర్‌పోర్ట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీకి నిధులు కేటాయించిన అనంతరం, ఫీజిబిలిటీ అధ్యయనాన్ని సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని ఆదేశించింది.