భారతీయ జనతా పార్టీ 25 వ వార్డు కౌన్సిలర్ పిన్నవారు రాజేష్ కాంగ్రెస్ లో చేరికతో ఆదిలాబాద్ జిల్లాలో ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన మర్చిపోకముందే.. నిమిషాల్లోనే తిరిగి కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరారు. దీంతో ఆదిలాబాద్ లో రాజకీయాలు అంతుచిక్కడం లేదని జనాలు అయోమయానికి గురవుతున్నారు. కట్టర్ బిజెపి కార్యకర్తగా కౌన్సిలర్ గా పేరుందిన 25వ వార్డు కౌన్సిలర్ పిన్ అవర్ రాజేష్ అలియాస్ దొడ్డన్న ఆదివారం కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి కంది శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడంపై తీవ్ర ఆందోళనకు దారితీసింది. ఈ ఆందోళనలో బీజేపీ నాయకుల పై లాఠీచార్జి పలువురు గాయాలపాలు కావాల్సిన పరిస్థితి ఏర్పడింది.
అయితే కాంగ్రెస్ లో చేరిన రాజేష్ కొద్ది నిమిషాల్లోనే తిరిగి బిజెపిలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి కండువా వేసుకొని బయటకు వచ్చిన రాజేష్ ను భారతీయ జనతా పార్టీ నేతలు దొరకబుచ్చుకున్నారు. వెంటనే తమ పార్టీలో చేరాలని కోరగా రాజేష్ ఆ పార్టీ ముఖ్య నేతల ఆధ్వర్యంలో తిరిగి బీజేపీ కండువా వేసుకున్నారు. దీంతో ఆదిలాబాద్ లో ఎవరూ ఏ పార్టీలో ఎప్పుడు ఉంటున్నారో తిరిగి ఏ పార్టీలోకి చేరుతున్నారో రాజకీయాలు అర్థం కావడం లేదని స్థానికులు తలలు పట్టుకుంటున్నారు. ఇదంతా కేవలం వారి స్వలాభం కోసం ఆడుతున్న రాజకీయ నాటకాలని కొంతమంది ఆరోపిస్తుండగా… మరి కొంతమంది రాజకీయ నాయకులు వివరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.