తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై ఏసీబీకి మరో ఫిర్యాదు అందింది. ఔటర్ రింగ్ రోడ్డు టెండర్లలో మాజీ మంత్రి కేటీఆర్ అక్రమాలకు పాల్పడ్డారని బీసీ పొలిటికల్ జేఏసీ అధ్యక్షుడు యుగంధర్ ఆరోపించారు. ఈమేరకు ఏసీబీ మాజీ మంత్రి కేటీఆర్‌పై ఫిర్యాదు చేశారు. ఓఆర్ఆర్ టెండర్ ప్రక్రియపై విచారణ జరిపి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని కోరారు.
కాగా, ఈ ఫార్ములా రేస్ అంశంపై ఇప్పటికే కేటీఆర్ పై కేసు నమోదైంది. కేసును కొట్టివేయాలంటూ కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో కేటీఆర్‌ను గురువారం ఏసీబీ ప్రశ్నించనుంది.