ఫార్ములా ఈ-కార్ రేస్ కేసు విచారణ నిమిత్తం బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు. తెలంగాణ హైకోర్టు ఆదేశాల మేరకు కేటీఆర్‌తో పాటు ఆయన తరఫు న్యాయవాదులను ఏసీబీ కార్యాలయంలోకి అనుమతించారు. కొద్దిసేపటి క్రితం ఏసీబీ విచారణ మొదలైంది.
విచారణ గదిలో కేటీఆర్ ఉండగా, కార్యాలయంలోని లైబ్రరీ గదిలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఉన్న కేటీఆర్ కనిపించేంత దూరంలో ఆయన లాయర్ ఉన్నారు. విచారణ గదిలో ఏం మాట్లాడుతున్నారనేది మాత్రం లాయర్ కు వినిపించదు. వీడియో, ఆడియో రికార్డింగ్ కు కూడా తెలంగాణ హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే.