రూ.2 లక్షల కంటే ఎక్కువ బకాయి ఉన్న వారికి రుణమాఫీపై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శుభవార్త తెలిపారు. రైతు భరోసా సబ్‌కమిటీ నివేదికను రైతులకు అందజేస్తామని చెప్పారు. ఈ ఏడాది వరి సాగులో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. లక్షన్నర ఎకరాల దిగుబడితో పంజాబ్ రాష్ట్రాన్ని వెనక్కి నెట్టింది. గతంలో 41 లక్షల ఎకరాల్లో సాగైన వరి ఈ ఏడాది 21 లక్షలకు పడిపోయింది. తెలంగాణ రాష్ట్రంలో సన్న ధాన్యం దిగుబడి పెరగడంతో పాటు దేశవ్యాప్తంగా సన్న ధాన్యానికి డిమాండ్ పెరిగింది. 25 జిల్లాల్లో ధాన్యం కొనుగోళ్లు కొనసాగుతున్నాయన్నారు.
9.7 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్ళు ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా చేశారన్నారు. 6 వందల 25 కోట్లు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు డబ్బులు అందించామన్నారు. బీజేపీ – బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతుల మనోధైర్యం దెబ్బతినే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. గతంతో పోల్చితే ఉత్పత్తి, కొనుగోళ్లు పెరిగాయన్నారు. అధికారం పోయినంత మాత్రాన ఇంతగనం ఆందోళన అవసరం లేదన్నారు. వాళ్ళ పార్టీలో ఆధిపత్యపోరు కోసం రైతులను ఇబ్బంది పెట్టకండి అని సూచించారు. రైతుల పై ఒత్తిడి లేదు, ఓపెన్ మార్కెట్ లో అవకాశం ఉన్నా అమ్ముకోవచ్చన్నారు. కొనుగోలు కేంద్రానికి వచ్చే ప్రతీ గింజా మేము కొంటామన్నారు. కేంద్రం గైడ్లైన్స్ లో మార్పులు చేయాలని కోరుతున్నామని తెలిపారు.