పదేళ్లకు ఒకసారి బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. 2014లో బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం అనంతరం 2024లో చేస్తున్నాం. సభ్యత్వ నమోదు సమీక్ష సమావేశానికి హాజరైన మంత్రి మాట్లాడారు. జిల్లాలోని రూరల్ మండలంలో నూతన కమిటీని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. నవంబర్ 1, నేను బీజేపీ ఉద్యమ బాట పట్టాను. తెలంగాణ సాధించుకున్న తర్వాత పదేళ్ల పాలనలో గత ప్రభుత్వాలు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాయన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనలో రాష్ట్రం వెనుకబడి ఉందన్నారు. రాష్ట్రంలో సరైన సంక్షేమ పథకాలు అమలు కావడం లేదు అని తెలిపారు.
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బీఆర్‌ఎస్ తరహాలోనే వ్యవహరిస్తుందని కేంద్ర మంత్రి విమర్శించారు. పేదలకు ఇల్లు కట్టకుండా పేదల ఇళ్లను కూల్చేస్తున్నా ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీదన్నారు. అతి తక్కువ సమయంలో ప్రజల వ్యతిరేకతను కాంగ్రెస్ ప్రభుత్వం కూడగట్టుకుందని తెలిపారు. మిగులు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కెసిఆర్ అప్పుల పాలు చేశారని, కాంగ్రెస్ ప్రభుత్వం మూసి సుందరీకరణ పేరుతో రూ.లక్ష 80 వేల కోట్ల బడ్జెట్ కేటాయించి ఇంతవరకు డీపీఆర్ తయారు చేయలేదన్నారు. కాంగ్రెస్‌పై వ్యతిరేకతతోనే హర్యానా రాష్ట్రంలో బీజేపీకి ప్రజలు పట్టా కట్టారన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ సహకరించకుండా ముందుకు పోనున్నట్లు తెలిపారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జమ్మూ కాశ్మీర్ లో బీజేపీకి గణనీయంగా ఓట్ల శాతం పెరిగిందని పార్టీని కొనియాడారు. ముస్లింలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో బీజేపీకి అధిక ఓట్లు రావడం విశేషమన్నారు.