టీడీపీ అగ్రనేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు భారీ ఊరటనిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మూడు కేసుల్లో నాయుడుకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి టి మల్లికార్జునరావు ఉత్తర్వులు జారీ చేశారు. దర్యాప్తును ప్రభావితం చేసేలా ఎలాంటి వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని నాయుడుని ఆదేశించారు. ఇన్నర్ రింగ్ రోడ్ (ఐఆర్‌ఆర్), ఇసుక, మద్యం వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబు నాయుడుపై ఏపీ సీఐడీ కేసులు నమోదు చేసింది.
ముందస్తు బెయిల్ కోసం టీడీపీ అధినేత హైకోర్టులో మూడు వేర్వేరు పిటిషన్లు దాఖలు చేశారు. ఇరు పక్షాల వాదనలు విన్న ఏపీ హైకోర్టు బుధవారం తీర్పు వెలువరించింది. మద్యం కేసులో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, రిటైర్డ్ ఐఏఎస్ శ్రీనరేష్‌లకు కూడా ముందస్తు బెయిల్ మంజూరైంది.