పరువు నష్టం కేసులో కాంగ్రెస్ అధ్యక్షుడు, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీని పూణే కోర్టు నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో ఆయనకు బెయిల్ మంజూరైంది. మార్చి 2023లో, లండన్‌లో వీరసావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలపై సావర్కర్ మనవడు సత్యకి సావర్కర్ పూణేలోని కోర్టులో పరువు నష్టం కేసు వేశారు.
ఈ కేసుకు సంబంధించి ఇవాళ రాహుల్ గాంధీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు అతనికి రూ.25,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. రాహుల్ గాంధీకి పూచీకత్తుగా కాంగ్రెస్ సీనియర్ నేత మోహన్ కోర్టుకు హాజరయ్యారు.