కేరళలోని వయనాడ్ లోక్ సభ ఉప ఎన్నికల్లో సరికొత్త రికార్డు నమోదైంది. కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంక గాంధీ భారీ మెజారిటీతో గెలుపొందారు. ఆ స్థానం నుంచి గతంలో పోటీ చేసిన ఆమె సోదరుడు రాహుల్ గాంధీ దాదాపు 3 లక్షల 65 వేల ఓట్ల తేడాతో గెలుపొందారు. అయితే రాహుల్ గాంధీ రాజీనామా తర్వాత ఆ స్థానం నుంచి తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేసిన ప్రియాంక గాంధీ ఉప ఎన్నికల్లో విజయం సాధించారు.

ఇక ప్రియాంక గాంధీ ఇప్పటికే రాహుల్ గాంధీ మెజారిటీని దాటేసింది. తాజాగా ప్రియాంకాకు 4 లక్షల 3 వేల 966 ఓట్ల మెజారిటీ సాధించారు. ప్రియాంకాకు 5.78 లక్షల ఓట్లు రాగా, కమ్యూనిస్ట్ అభ్యర్థి సత్యన్ మోక‌రి రెండో స్థానంలో, భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నవ్య హరిదాస్ 10,000 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *