భారతదేశంలోని అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్‌లో పదేళ్ల తర్వాత అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 2019లో ఆర్టికల్ 370 రద్దు తర్వాత జరుగుతున్న ఎన్నికలు కావడంతో ప్రాధాన్యత సంతరించుకుంది. కాశ్మీర్ లోయలో నేడు తొలి దశ పోలింగ్ జరుగుతోంది. పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నట్టు అధికారులు తెలిపారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు 41.17 శాతం పోలింగ్ నమోదైంది.
జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో 90 స్థానాలు ఉండగా, తొలి దశలో 24 స్థానాలకు పోలింగ్ జరుగుతోంది. 24 స్థానాలకు 219 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. సాయంత్రం 6 వరకు పోలింగ్ జరగనుంది. ఉగ్రదాడుల నేపథ్యంలో జమ్మూకశ్మీర్‌లో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. తనిఖీలు ముమ్మరం చేశారు.