బాలీవుడ్ న‌టుడు స‌ల్మాన్ ఖాన్‌కు మ‌రోసారి బెదిరింపులు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో ఉన్న శ‌త్రుత్వం స‌మాప్తం కావాలంటే రూ.5కోట్లు ఇవ్వాల‌ని అగంత‌కులు డిమాండ్ చేశారు. ఈ మేర‌కు ముంబ‌యి ట్రాఫిక్ పోలీసుల వాట్స‌ప్ నంబ‌ర్‌కు గురువారం రాత్రి ఓ సందేశం వ‌చ్చింది. దాంతో పోలీసులు అప్ర‌మ‌త్త‌మ‌య్యారు.

ఈ బెదిరింపుల‌ను ఎట్టిప‌రిస్థితుల్లో తేలిగ్గా తీసుకోవ‌ద్దు. స‌ల్లూ భాయ్ ప్రాణాల‌తో ఉండాల‌న్నా, లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్‌తో వైరాన్ని ముగింపు ప‌ల‌కాల‌న్నా ఆయ‌న రూ. 5కోట్లు ఇవ్వాలి. ఈ న‌గ‌దు ఇవ్వ‌కుంటే మాజీ ఎమ్మెల్యే సిద్ధిఖీ కంటే దారుణ‌మైన ప‌రిస్థితులు చూడాల్సి వ‌స్తుంది అని అగంత‌కులు సందేశంలో పేర్కొన్నారు. కాగా, ఈ బెదిరింపుల‌పై ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్లు పోలీసులు తెలిపారు. ఆ సందేశం ఎక్క‌డి నుంచి వ‌చ్చింద‌నే విష‌య‌మై విచార‌ణ చేస్తున్న‌ట్లు చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *