జమ్మూకాశ్మీర్‌లో మంగళవారం తుది విడత పోలింగ్ జరగనుంది. ఆదివారం ఎన్నికల ప్రచారం ముగిసింది. అక్టోబర్ 1న జరిగే చివరి పోలింగ్‌తో మూడు విడతల ఓటింగ్ ముగుస్తోంది. పోలింగ్ సిబ్బంది, ఈవీఎంలతో పోలింగ్ బూతులకు చేరుకుంటున్నారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీగా భద్రతా బలగాలు మోహరించాయి. ఓటర్లు ధైర్యంగా ఓటు వేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
జమ్మూకాశ్మీర్‌లో మొత్తం 90 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇప్పటికే సెప్టెంబర్ 18, 25 తేదీల్లో 50 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. ఇక అక్టోబర్ 1న 40 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరగనుంది. రెండు విడతల్లో జరిగిన పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఎలాంటి గొడవలు, ఉద్రిక్తతలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయి. మంగళవారం జరిగే పోలింగ్ కోసం కూడా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఓటర్లకు అన్ని విధాలా వసతులు కల్పించారు. ఎన్నికల ఫలితాలు మాత్రం అక్టోబర్ 8న విడుదల కానున్నాయి.