ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుంది. కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 5న పోలింగ్, ఫిబ్రవరి 8న ఓట్ల లెక్కింపు ఉంటుందని కేంద్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజీవ్ కుమార్ వెల్లడించారు. జనవరి 10న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. నామినేషన్ల సమర్పణకు చివరి తేదీ జనవరి 17 వరకు జనవరి 18న నామినేషన్ల పరిశీలన ప్రారంభమవుతుంది. జనవరి 20 వరకు నామినేషన్లు ఉపసంహరించుకోవచ్చు.

ఢిల్లీలో మొత్తం 1.55 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. తొలిసారిగా 2.08 లక్షల మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. 13,033 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్‌ను అందుబాటులోకి తెస్తున్నట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. 85 ఏళ్లు పైబడిన వారికి ఇంటి నుంచే ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *