టాలీవుడ్‌ క‌మెడియ‌న్‌ వెన్నెల కిషోర్, అనన్య నాగళ్ల ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్’. ‘శ్రీ‌కాకుళం షెర్లాక్ హోమ్స్’. ‘చంటబ్బాయ్ తాలుకా’ అనేది ఉప‌శీర్షిక‌. రైట‌ర్‌ మోహ‌న్ దర్శ‌క‌త్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ఈ చిత్రానికి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన అప్డేట్స్ ప్రేక్షకులలో ఆసక్తి రేకెత్తించాయి. పోస్టర్లు, పాటలు ఇప్పటికే మంచి స్పందనను తెచ్చుకోవడంతో పాటు సినిమా మీద ఆసక్తిని పెంచాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్ 25న విడుదల చేయాలని నిర్ణయించారు.

తాజాగా మేకర్స్ ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. “అవుట్ లుక్ చూసి కాదు సార్‌.. అవుట్ పుట్ చూసి ఇవ్వండి. ఛాన్సిస్తేనే క‌దా చిరంజీవి మ్యాచో మెగాస్టార్ అయ్యారు”, “ఈ క్రైమ్‌లో పాత్ర‌ధారి, సూత్ర‌ధారి, క‌ప‌ట‌ధారితో పాటు ఓ మాయ‌దారి కూడా ఉన్నాడు” అనే డైలాగులు టీజ‌ర్‌లో బాగున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *