కిరణ్ అబ్బవరం కొత్త సినిమా ‘దిల్ రుబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రుక్సర్ థిల్లాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. రీసెంట్‌గా ఈ మూవీ షూటింగ్ పూర్తయింది. తాజాగా రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేశారు. హోలీ సందర్భంగా మార్చి 14న ఈ చిత్రాన్ని వరల్డ్‌వైడ్‌గా విడుదల చేయనున్నట్టు శుక్రవారం ప్రకటించారు.
వాస్తవానికి ప్రేమికుల రోజునే రిలీజ్ చేయాలని ప్లాన్ చేసినా బెటర్ అవుట్‌పుట్ కోసం పోస్ట్ పోన్ చేసినట్టు తెలియజేశారు. లవ్, రొమాంటిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుందన్నారు. ‘క’ లాంటి సూపర్ హిట్ తర్వాత కిరణ్ అబ్బవరం నుంచి వస్తోన్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి.