టాలీవుడ్ ఐకాన్ స్టార్, రికార్డుల వేటగాడు అల్లు అర్జున్ రాజకీయాల్లో తదుపరి అడుగు వేయబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన పొలిటికల్ ఎంట్రీకి ప్లాన్ చేస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ టీమ్ స్పందించింది. అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రావడంలేదని స్పష్టం చేసింది. జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని తెలిపింది.
అల్లు అర్జున్ కు సంబంధించిన విషయాలు ఏవైనా ఆయన టీమ్ మాత్రమే అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించింది. అల్లు అర్జున్ టీమ్ నుంచి వచ్చిన సమాచారాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. ఇలాంటి నిరాధారమైన ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దని అల్లు అర్జున్ టీమ్ పేర్కొంది. ఇలాంటి కల్పిత ప్రచారాలకు మీడియా సంస్థలు, ప్రజలు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేసింది.