స్టార్ యాంకర్‌ సుమ కనకాల, ఈ పేరుకు బుల్లితెరపై ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలాంటిదో చెప్పక్కర్లేదు. తన కామెడీ పంచ్‌లతో ప్రత్యేకమైన ఇమేజ్‌ని సంపాదించుకుంది.ఎంతో మంది యాంకర్స్‌ వస్తున్నారు, పోతున్నారు, కానీ సుమ మాత్రం దశాబ్దాలుగా తన స్థానాన్ని పదిలపరుచుకుంటుంది. ఇక పెద్ద సినిమా పెద్ద సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయిన, మూవీ ప్రమోషన్స్ కార్యక్రమలైన హోస్ట్‌గా సుమ ఉండాల్సిందే. అంతేకాదు హీరోలు, హీరోయిన్ లు కూడా సుమ మాటలను బాగా ఇష్టపడతారు.

అయితే సుమ ‘జయమ్మ పంచాయతీ’ మూవీ తో వెండితెర పై సందడి చేసిన విషయం తెలిసిందే ఆమె పాత్రకు, యాక్టింగ్‌కి మంచి మార్కులు పడ్డాయి. కానీ ఆశించిన స్థాయిలో ఆడలేకపోయింది. ఆ తర్వాత కాస్త విరామం తీసుకున్న సుమ తాజాగా ‘ప్రేమంటే’ చిత్రంతో మరోసారి అలరించబోతోంది. ఆదివారం ఈ చిత్రాన్ని పూజా కార్యక్రమంతో గ్రాండ్‌గా ప్రారంభించారు. ఈ సందర్భంగా మూవీ టీం ఫోటోలు షేర్ చేస్తూ చిత్రం పై అధికారికంగా ప్రకటన ఇచ్చింది. ఇందులో సుమ పాత్ర కీలకంగా ఉండబోతుందట.ఈ మూవీతో నవనీత్‌ శ్రీరామ్‌ దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *