మెగా అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. మరియు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న పాన్ ఇండియా మూవీ గేమ్ ఛేంజర్ థియేటర్లలోకి రాబోతోంది. జనవరి 10 మెగా అభిమానులకు అసలైన సంక్రాంతి ప్రారంభం. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. ఇప్పటి వరకు గేమ్ ఛేంజర్ నుంచి జరగండి, రా మచ్చా, నానా హైరానా, డోప్ సాంగ్స్ రిలీజ్ అవగా.. చార్ట్ బస్టర్స్ అయ్యాయి. తమన్ అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చాడు.
ఎన్నో అంచనాలు సెట్ చేసుకున్న ఈ సినిమాపై రీసెంట్ గా ట్రైలర్ తర్వాత అవి మరింత ఎక్కువ అయ్యాయి. అయితే ఈ చిత్రానికి ఇంట్రెస్టింగ్ గా యూఎస్ మార్కెట్ లో కంటే యూకే మార్కెట్లో సెన్సేషనల్ బుకింగ్స్ కనిపిస్తున్నాయి. ఇక వీటితో పాటుగా పలు ప్రాంతాల్లో ఫ్యాన్ స్పెషల్ షోస్ కూడా ప్లాన్ చేసుకుంటుండగా అవి ఇప్పుడు ఒకొక్కటిగా సోల్డ్ ఔట్స్ పడుతున్నాయి. దీనితో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ర్యాంపేజ్ మామూలు లెవెల్లో లేదని చెప్పుకోవాలి. అలాగే మరిన్ని షోస్ ని కూడా యూకే లో యాడ్ చేస్తున్నట్టుగా మేకర్స్ స్పష్టం చేశారు. ఇలా మొత్తానికి గేమ్ ఛేంజర్ మేనియా ఓ రేంజ్ లో నడుస్తోంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు అలాగే భారీ బడ్జెట్ తో దిల్ రాజు నిర్మించారు. ఈ జనవరి 12న గ్రాండ్ గా రిలీజ్ కి రాబోతుంది.