సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా ‘SDT18’కి ‘ఎస్వైజీ’ (సంబరాల ఏటి గట్టు) అనే టైటిల్ ఖరారు చేశారు. ఈ చిత్రానికి రోహిత్ కేపీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల, ఈ సినిమా గ్లింప్స్, టైటిల్, విడుదల తేదీలను ఒకేసారి చిత్ర బృందం విడుదల చేసింది.
‘ఎస్వైజీ’ గ్లింప్స్‌ను గురువారం జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ విడుదల చేసారు. ఈ గ్లింప్స్‌లో సాయి దుర్గ తేజ్ పాత్రను శక్తివంతంగా, ఉత్కంఠభరితంగా ప్రదర్శించారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా అజనీశ్ లోక్‌నాథ్ పనిచేస్తుండగా, ఆయన అందించిన నేపథ్య సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తోంది. సాయి దుర్గ తేజ్‌కు జోడీగా ఐశ్వర్య లక్ష్మి నటిస్తుండగా, జగపతి బాబు, సాయి కుమార్, శ్రీకాంత్, అనన్య నాగళ్ల వంటి ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ భారీ చిత్రం 2025 సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.