రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా మరో ఘనత సాధించాడు. జూలై నెలలో ప్రముఖ మీడియా సంస్థ ఆర్మాక్స్ విడుదల చేసిన భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన పురుష సినీ నటుల జాబితాలో అతను అగ్రస్థానంలో నిలిచారు. బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అక్షయ్ కుమార్‌లను వెనక్కి నెట్టి ఇండియా నంబర్ 1 హీరోగా నిలిచాడు.
ఇక ఈ జాబితాలో రెండో స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ఉన్నారు. మూడో స్థానంలో షారూక్ నిలిచారు. ప్రభాస్‌తో పాటు ఈ లిస్ట్‌లో టాలీవుడ్ నుంచి పలువురు హీరోలు చోటు దక్కించుకున్నారు. వారిలో ప్రిన్స్ మహేశ్ బాబు నాలుగో స్థానంలో ఉంటే ఐదో స్థానంలో తారక్, ఏడో స్థానంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తొమ్మిదో స్థానంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఉన్నారు. ఆ తర్వాత ఆరో స్థానంలో అక్షయ్ కుమార్, ఎనిమిదో స్థానంలో సల్లూభాయ్, పదో స్థానంలో అజిత్ కుమార్ నిలిచారు.