దక్షిణాది సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో నటించిన చిత్రం లాల్ సలాం. ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్ అనే ముస్లిం లీడర్ పాత్ర పోషిస్తున్నారు. తాజాగా లాల్ సలాం చిత్రం నుంచి టీజర్ రిలీజ్ అయింది. ఇందులో రజనీకాంత్ సీరియస్ లుక్ తో కనిపించారు. ఈ సినిమాలో విష్ణువిశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రంలో జీవితా రాజశేఖర్, సెంథిల్, తంబి రామయ్య, అనంతిక, వివేక్ ప్రసన్న, తంగ దురై తదితరులు నటించారు. రీసెంట్‌గా జైలర్‌తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన తలైవర్ ఇప్పుడు ‘లాల్ సలాం’తో సంక్రాంతికి అలరించనుండటంతో ఆయన అభిమానులతో పాటు సినీ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పీక్స్‌కు చేరుకున్నాయి. ఈ చిత్రానికి స్వరమాంత్రికుడు ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందిస్తుండడం మరో ప్రధాన ఆకర్షణ.