సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక జంటగా నటించిన పాన్ ఇండియా పుష్ప 2 డిసెంబర్ 5న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం చెన్నైలోని లియో ముత్తు ఇండోర్ స్టేడియంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలో అల్లు అర్జున్, రష్మిక, శ్రీలీల, కోలీవుడ్ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అల్లు అర్జున్ తన కెరీర్‌కు సంబంధించిన పలు ముఖ్య విషయాలను పంచుకున్నారు. చెన్నై వస్తే ఆ అనుభూతే వేరుగా ఉంటుందన్నారు. ఈ నేలతో తనకు అంత అనుబంధం ఉందన్నారు. తన జీవితంలో మొదటి 20 ఏళ్లు చెన్నైలోనే గడిచాయని చెప్పారు. తాను ఏమి సాధించినా అదంతా చెన్నైకే అంకితమని అల్లు అర్జున్ ప్రకటించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *