సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రధాన పాత్రలో నటిస్తున్న “పుష్ప: ది రూల్” చిత్రం కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తున్న ఈ సినిమా నుంచి విడుదలైన ప్రచార చిత్రాలు, పోస్టర్లు, పాటలు ప్రేక్షకుల్లో భారీ ఆసక్తిని రేకెత్తించాయి.

తాజాగా ఈ సినిమా నుంచి నాలుగో పాట “పీలింగ్స్” క్రేజీ రెస్పాన్స్‌ను అందుకుంది. మలయాళంలో జరిగిన ఈవెంట్‌లో అనౌన్స్ చేసిన ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, అన్ని భాషల వెర్షన్లలోనూ ఈ పాట పల్లవి లిరిక్స్ మలయాళంలోనే ఉంచుతున్నారని చిత్ర బృందం వెల్లడించింది. రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ అందించిన మలయాళ బీట్‌లతో ఈ పాట అక్కడి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ పాట విడుదల తేదీ కోసం ఎదురుచూస్తున్న అభిమానులకు చిత్ర బృందం అదిరే ప్రోమోతో అభిమానులకు తీపి కబురు అందించింది. ఈ మోస్ట్ అవైటెడ్ సాంగ్‌ను డిసెంబరు 1న విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందని, ఆన్‌లైన్‌లో ఎలాంటి రికార్డులు బద్దలుగొడుతుందో చూడాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *