రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పుడు తన సినిమాల స్పీడ్ పెంచాడు. ఇప్పుడు అతని లైనప్ లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. బాహుబలితో ఐదేళ్లలో రెండు సినిమాలకే పరిమితమైన ఆయన ఆ తర్వాత వరుస సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో సందడి చేస్తున్నాడు. గత ఏడాది సాలార్ సినిమాతో వరుస ఫ్లాపులకు ఫుల్ స్టాప్ పెట్టి, కల్కి 2898ADతో అదరగొట్టాడు. ప్రస్తుతం ప్రభాస్ మారుతి దర్శకత్వంలో రాజా సాబ్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు త్వరలో కల్కి 2 పనులు కూడా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే.
కల్కి 1తో రూ.1000 కోట్ల మార్క్ మళ్లీ రీచ్ అయిన ప్రభాస్ రాబోతున్న సినిమాలతో మరోసారి ఆ టార్గెట్ పెట్టుకున్నాడు. రాజా సాబ్ సినిమా 2025 ఏప్రిల్ లో రిలీజ్ అవుతుండగా తర్వాత సంవత్సరం మరో సినిమా కూడా రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. హను రాఘవపుడి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఫౌజి సినిమా పీరియాడికల్ డ్రామాగా వస్తుంది కాబట్టి ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ కల్కి 2 కోసం కొంత సమయం కేటాయించాల్సి ఉంటుంది. అయితే కల్కి 1 లోనే పార్ట్ 2 కి సంబంధించిన సీన్లు షూట్ చేశారని తెలుస్తుంది. ఇక మరోపక్క ఫౌజి కోసం ప్రభాస్ కొత్త మేకోవర్ తో కనిపించబోతున్నాడు. స్పిరిట్ లో పోలీస్ పాత్రలో కూడా ప్రభాస్ అదరగొడతాడని తెలుస్తుంది.