సినీ నటుడు అల్లు అర్జున్‌కు రాంగోపాల్ పేట పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను చూసేందుకు కిమ్స్ ఆసుపత్రికి ఎప్పుడు రావాలో ముందుగా తెలియజేయాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ మేరకు గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందించారు.
నిన్న కూడా అల్లు అర్జున్ కు రామ్‌గోపాల్ పేట్ పోలీసులు నోటీసులు ఇచ్చారు. శ్రీతేజ్‌ను పరామర్శించేందుకు రావద్దని నోటీసులో పేర్కొన్నారు. అల్లు అర్జున్ ఆసుపత్రికి వస్తున్నారనే సమాచారంతో ఈ నోటీసులు ఇచ్చారు. కోర్టు ఇచ్చిన బెయిల్ షరతులను కచ్చితంగా పాటించాలని సూచించారు. ఏదైనా జరిగితే అల్లు అర్జున్ బాధ్యత వహించాల్సి ఉంటుందని చెప్పారు. పరామర్శకు రావాలనుకున్నప్పుడు తమ సూచనలను పాటించాలని పేర్కొన్నారు.