చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి హీరో అల్లు అర్జున్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకానున్న నేపథ్యంలో పోలీసులు ఆంక్షలు విధించారు. ఈరోజు అల్లు అర్జున్ ఏసీపీ ఎదుట హాజరుకానున్నారు. అల్లు అర్జున్‌ను విచారణ అధికారి ఏసీపీ రమేష్ కుమార్, సెంట్రల్ జోన్ డీసీపీ విచారించనున్నారు. దీంతో పోలీస్ స్టేషన్ వద్ద ఆంక్షలు విధించారు. వాహనాలు రాకపోకలతో పాటు ఇతరుల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. కోర్టు పరిధిలో ఉన్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలంటూ ఏసీపి రమేశ్ కుమార్ మీడియాను హెచ్చరికలు జారీ చేశారు.
పోలీస్ స్టేషన్ వరకు 200 మీటర్ల దూరం నుంచి ఆంక్షలు విధించారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌కు డీసీపీ చేరుకున్నారు. అక్కడి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసులకు సూచించారు. పోలీసుల వద్దకు ఎవరూ రాకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలన్నారు. 200 మీటర్ల లోపు ఆంక్షలు ఉండాలని, వాహనాలను అనుమతించరాదన్నారు. ఉదయం 11 గంటలలోపు అల్లు అర్జున్ రానున్న నేపథ్యంలో పోలీస్టేషన్ల పరిధిలో ఎవరిని అనుమతించకూడదని తెలిపారు. అల్లు అభిమానులు కూడా భారీ రానున్న నేపథ్యంలో ఆంక్షలు విధించినట్లు తెలిపారు.