రష్మిక టాలీవుడ్, బాలీవుడ్‌లో వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ‘పుష్ప’ హిట్ తో అమ్మడి క్రేజ్ పాన్ ఇండియా స్థాయిలో అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం ఆ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న పుష్ప-2లో బన్నీ సరసన నటిస్తుంది. పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెలో మైత్రి మూవీస్ సంస్థ నిర్మిస్తుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. షూటింగ్ చివరి షెడ్యూల్‌లో బన్నీ, రష్మిక కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆగస్ట్ 15న విడుదల కావాల్సిన ఈ సినిమా షూటింగ్ ఆలస్యం కావడంతో వాయిదా పడినప్పటికీ డిసెంబర్ 6న గ్రాండ్ రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
మరోవైపు రష్మిక బాలీవుడ్‌లో దూసుకుపోతోంది. తాజాగా విక్కీ కౌశల్ సరసన ‘చావా’ చిత్రంలో రష్మిక నటిస్తుంది. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ని విడుదల చేశారు మేకర్స్. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఈ సినిమా కూడా డిసెంబర్ 6న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్టు అధికారకంగా ప్రకటించారు మేకర్స్. దింతో ఒకేరోజు, ఒకేసారి, ఒకే ఏడాది రెండు పాన్ ఇండియా సినిమాలు విడుదల అవుతన్న హీరోయిన్ గా రష్మిక క్రేజ్ సంపాదించింది. బాలీవుడ్‌లో సోలోగా విడుదల అవుతుందని భావించిన పుష్ప-2కి చావా రూపంలో పోటీ ఎదురైంది.