దర్శకుడు ప్రశాంత్ వర్మ తన సూపర్ హీరో కథతో నందమూరి బాలయ్య వారసుడిని పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీని సింబా ఈజ్ కమింగ్ అంటూ ధృవీకరించిన దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త ఫోటోను షేర్ చేశాడు.
నందమూరి మోక్షజ్ఞ ఒరిజినల్ ఫోటోను షేర్ చేస్తూ ‘యాక్షన్‌కి సిద్ధమా?’ అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఫోటో చూసిన నందమూరి అభిమానులు ఫిదా అవుతున్నారు. హీరో మెటీరియల్లా కుర్రాడు భలే ఉన్నాడు అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఈ ఫొటోలో మోక్షజ్ఞ పూర్తిగా స్లిమ్ అయ్యాడు.ఇప్పటికే, ఈ సినిమా కోసం నృత్యాలు, పోరాటాల్లో శిక్షణ తీసుకుని బరిలో దిగాడు. బాలయ్య తగ్గ వారసుడి అనిపించుకునేలా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.