నందమూరి అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. బాలకృష్ణ వారసుడు జూనియర్ నటసింహం మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు. ‘హనుమాన్’ సినిమా దర్శకుడు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. మోక్షజ్ఞ పుట్టినరోజును పురస్కరించుకుని మేకర్స్ ఈరోజు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
ఫస్ట్ లుక్ లో మోక్షజ్ఞ చాలా క్యూట్ గా ఉన్నాడు. ‘సింబ ఈజ్ కమింగ్’ అంటూ ఫస్ట్ లుక్ పై పేర్కొన్నారు. మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ ను చూసిన నందమూరి అభిమానులు ‘వావ్’ అంటున్నారు. మోక్షజ్ఞకు బర్త్ డే విషెస్ తెలపడంతో పాటు, హీరోగా తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.