అక్కినేని నాగచైతన్య, చందూ మొండేటి కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజాగా చిత్రం ‘తండేల్‌’. ఈరోజు చైతూ పుట్టినరోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ తాజాగా మూవీ నుంచి కొత్త పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో నాగ‌చైత‌న్య ర‌గ‌డ్‌ లుక్‌లో క‌నిపించారు. చూడ‌గానే ఆక‌ట్టుకునేలా మేక‌ర్స్ ఈ స్పెష‌ల్ పోస్ట‌ర్‌ను డిజైన్ చేశారు.

ఇక ఈ భారీ ప్రాజెక్ట్ లో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుండ‌గా, రాక్‌స్టార్ దేవీశ్రీ ప్ర‌సాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ 2 వారు భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ల‌వ్ అండ్ యాక్ష‌న్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతున్న ‘తండేల్’ మూవీ 2025 ఫిబ్ర‌వ‌రి 7న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *