మంచు విష్ణు హీరోగా, ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న భారీ బడ్జెట్ చిత్రం కన్నప్ప నుంచి తాజాగా మరొక విశేషం వెలువడింది. ఈ చిత్రంలో మహాదేవ శాస్త్రి పాత్రలో నటిస్తున్న డాక్టర్ మోహన్ బాబుకు సంబంధించిన పూర్తి లుక్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ విషయాన్ని మంచు విష్ణు తన సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ, “మహాదేవ శాస్త్రి చిరకాలం గుర్తుండిపోయే భయంకరమైన పాత్ర” అంటూ పేర్కొన్నారు. ఈ పాత్ర ప్రేక్షకుల హృదయాల్లో స్థిరంగా నిలిచిపోతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
ఈ చిత్రంలో మోహన్ లాల్, ప్రభాస్, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ వంటి అగ్రనటుల పాల్గొనడం ద్వారా కన్నప్ప పై పాన్ ఇండియా స్థాయిలో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ, అవా ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్లపై తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.