మెగా ప్రిన్స్‌ వ‌రుణ్ తేజ్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు కరుణ కుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న తాజా చిత్రం మ‌ట్కా. ఈ సినిమా ఈ నెల‌ 14న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. దీంతో ప్ర‌స్తుతం చిత్ర యూనిట్ ప్ర‌చార కార్య‌క్ర‌మాల‌ను ముమ్మ‌రం చేసింది. దీనిలో భాగంగా తాజాగా మేక‌ర్స్ ట్రైల‌ర్‌ను విడుద‌ల చేశారు.

“సర్క‌స్‌లో జోక‌ర్‌ను చూసి జ‌నం అంతా న‌వ్వుతారు, చ‌ప్ప‌ట్లు కొడ‌తారు. కానీ ఒక చిన్న క‌ర్ర ప‌ట్టుకుని అదే స‌ర్క‌స్‌లో పులుల‌ను, సింహాల‌ను ఆడించేవాడు ఒక‌డు ఉంటాడు. అలాంటోడే వీడు రింగ్ మాస్ట‌ర్” అనే డైలాగ్‌తో ట్రైల‌ర్ ప్రారంభ‌మ‌వుతుంది. ట్రైల‌ర్‌లో మాస్ ఎలివేష‌న్స్‌తో పాటు, వ‌రుణ్ కొత్త‌గా క‌నిపించాడు. విశాఖ‌ప‌ట్నం నేపథ్యంగా సాగే ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌లో వరుణ్‌ నాలుగు భిన్న గెటప్పుల్లో కనిపించనున్నారు. విజేందర్‌ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. వ‌రుణ్ స‌ర‌స‌న‌ మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా న‌టిస్తోంది. నవీన్‌ చంద్ర, రవీంద్ర విజయ్‌, కిశోర్ తదితరులు ఇత‌ర‌ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ మూవీకి త‌మిళ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌ జీవి ప్రకాశ్ కుమార్ బాణీలు అందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *