మంచు ఫ్యామిలీ వివాదం ఇటీవల పలు వివాదాలకు దారి తీసిన సంగతి తెలిసిందే. మోహన్ బాబు మరియుమనోజ్ మధ్య మొదలైన గొడవ, మీడియాపై దాడి తర్వాత కేసు మరో మలుపు తిరిగింది. ఈ దాడి నేపథ్యంలో మోహన్ బాబుపై పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. అదేవిధంగా మంచు మనోజ్, మంచు విషు లు పదుల సంఖ్యలో బౌన్సర్లతో జల్ పల్లిలో వీరంగం సృష్టించారు. ఒక్కొక్కరుగా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో, జోక్యం చేసుకున్న పోలీసులు మంచు ఫ్యామిలీకి వార్నింగ్ ఇచ్చారు.

జర్నలిస్టు పై దాడి కేసులో మోహన్ బాబుపై కేసు నమోదు చేయడంతో, తనను అరెస్ట్ చేయకుండా ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేయగా అందుకు హై కోర్టు నిరాకరించింది. దీంతో మోహన్ బాబును పోలీసులు విచారణకు రమ్మని ఆదేశించగా అందుకు తనకు కొంత సమయం కావాలని కోరాడు మోహన్ బాబు. తాజాగా ఆయనకు ఇచ్చిన గడువు ముగిసిన నేపథ్యంలో విచారణకు పిలిచేందుకు గాలించగా మోహన్ బాబు ఆచూకీ లభించలేదట. గత కొద్దీ రోజులుగా మోహన్ బాబు అజ్ఞాతంలో ఉన్నారని తెలిసింది. చంద్రగిరిలో ఉన్నారని సమాచారం రాగ అక్కడ ఆరాతీయగా డిసెంబర్ 23న మంచు మోహన్ బాబు అజ్ఞాతంలోకి వెళ్లారని తెలిసిందట. ప్రస్తుతం మోహన్ బాబు అమెరికాలో తలదాచుకున్నారని ఎంబీయు వర్గాలలో చర్చ నడుస్తుంది. డిసెంబర్ 16వ తేది హైదరాబాద్ నుంచి చంద్రగిరిలో ఉంటున్నమోహన్ బాబు అరెస్ట్ భయంతో ఎవ్వరికి చెప్పకుండా అమెరికా పారిపోయాడని సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *