ప్రముఖ దర్శకుడు కొరటాల శివ, జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో సెప్టెంబర్ 27న విడుదలైన దేవర మూవీ పాజిటివ్ టాక్‌తో మంచి వసూళ్లు రాబడుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో మేకర్స్ తాజాగా మూవీపై ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. చిత్రం నిడివి ఎక్కువ కావడంతో పాటు సరైన ప్లేస్‌మెంట్ దొరకకపోవడంతో సూపర్ హిట్ సాంగ్ ‘దావూదీ’ని మేకర్స్ ఆఖరి నిమిషంలో మూవీ నుంచి తొలగించారు. దీంతో తారక్ మంచి డ్యాన్స్ మూవ్‌మెంట్స్‌ను అభిమానులు మిస్ అయ్యారు. అయితే, ఇవాళ్టి నుంచి ఈ పాటను తిరిగి యాడ్ చేస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. దగ్గరిలోని థియేటర్లలో ‘దావూదీ’ని ఎంజాయ్ చేయడంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా సాంగ్ తాలూకు ఓ స్పెషల్ పోస్టర్‌ను కూడా పంచుకుంది.
ఇక దేవరలో ఎన్టీఆర్ సరసన తొలిసారి బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ కథానాయికగా నటించిన విషయం తెలిసిందే. అలాగే మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ విలన్‌గా కనిపించారు. ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, మురళీ శర్మ, మలయాళ నటుడు షైన్ టామ్ ఛాకో తదితరులు ఇతర కీలక పాత్రల్లో మెరిశారు. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్ సంయుక్తంగా నిర్మించిని ఈ మూవీకి తమిళ యువ సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకూర్చారు.