ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే షూటింగ్ దాదాపు పూర్తి చేసుకున్న ఈ సినిమా కోసం ప్రస్తుతం ఐటెమ్ సాంగ్ చిత్రీకరిస్తున్నారు. అయితే, షూటింగ్ సెట్స్ నుంచి ఓ ఫొటో లీక్ కావడం, అది కాస్తా నెట్టింట వైరల్ కావడంతో ఇప్పుడు పుష్ప మరోసారి ట్రెండింగ్‌లోకి వచ్చేసింది.
ఇక లీకైన ఫొటోలో హీరో అల్లు అర్జున్, యంగ్ బ్యూటీ శ్రీలీల డ్యాన్స్ క్యాస్టూమ్స్‌లో కనిపిస్తున్నారు. బ్యాక్‌గ్రౌండ్ అంతా డ్యాన్సర్లతో కలర్‌ఫుల్‌గా ఉంది. కాగా, ఈ ఫొటో ఎలా లీక్ అయ్యిందో తెలియదు. కానీ, నిమిషాల్లోనే ఇది నెట్టింట వైరల్‌గా మారింది. దీనిపై బన్నీ అభిమానులు మాత్రం రెండు వర్గాలు విడిపోయి స్పందిస్తున్నారు. కొందరు సాంగ్ రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమంటూ పొగడుతుంటే.. మరికొందరు ఇలా ఫొటోలు లీక్ చేయండం ఎందుకని కామెంట్ చేస్తున్నారు.