News5am, Latest News Telugu (09-06-2025): కమల్ హాసన్ నటించిన ‘థగ్ లైఫ్’ సినిమా జూన్ 5న విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంది. తొలి వీకెండ్ పూర్తయ్యేసరికి వసూళ్లు ఆశించిన స్థాయిలో లేనట్లుగా కనిపిస్తున్నాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమా ఇండియాలో రూ.36.52 కోట్ల నెట్ వసూళ్లు మాత్రమే రాబట్టింది. వీకెండ్‌లో (శుక్ర, శని, ఆదివారాలు) కూడా కలెక్షన్లు తక్కువగానే ఉండటం మేకర్స్‌ను నిరాశకు గురిచేసింది. శుక్రవారం రూ.7.15 కోట్లు, శనివారం రూ.7.75 కోట్లు, ఆదివారం రూ.6.50 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. రూ.200 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా నాలుగు రోజుల్లోనే రూ.50 కోట్ల నెట్ మార్క్ దాటకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
‘ఇండియన్ 2’, ‘విక్రమ్’ వంటి కమల్ హాసన్ గత సినిమాలతో పోలిస్తే, ఈ చిత్రం ఓపెనింగ్స్ చాలా తక్కువగా ఉన్నాయి. ఉదాహరణకి, ఇండియన్ 2 మూడురోజుల్లోనే రూ.69.15 కోట్లు, విక్రమ్ రూ.110.8 కోట్లు వసూలు చేశాయి. కానీ ‘థగ్ లైఫ్’ వసూళ్లు తక్కువగా ఉండటంతో, ఇది కమల్ గత ఐదేళ్లలో అత్యల్ప వసూళ్లు సాధించిన చిత్రంగా నిలిచింది. ముఖ్యంగా కన్నడ భాష వివాదంతో ఈ సినిమా కర్ణాటకలో విడుదల కాకపోవడం కలెక్షన్లపై దెబ్బ వేసింది. బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే వరల్డ్ వైడ్ గా రూ.106 కోట్ల షేర్, రూ.210 కోట్ల గ్రాస్ వసూళ్లు అందుకోవాలి. ఈ సినిమాను కమల్ హాసన్ నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిలింస్ ఇంటర్నేషనల్, మణిరత్నం మద్రాస్ టాకీస్, ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ కలిసి నిర్మించాయి.
More Latest News Telugu:
Latest News Telugu:
సరికొత్త పాయింట్‌తో ఆది హారర్ థ్రిల్లర్..
మాస్ రాజా రవితేజ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..
More Latest News Telugu: External Sources
థగ్ లైఫ్.. షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు.. నాలుగు రోజుల్లో ఎన్ని కోట్లంటే?.. బ్రేక్ ఈవెన్ కష్టమే!