News5am, Latest News Telugu (10-06-2025): నందమూరి బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘అఖండ-2’ టీజర్ విడుదలైంది. చాలా రోజులుగా అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న ఈ టీజర్‌ను సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ నటిస్తుండగా, రామ్ ఆచంట, గోపీ ఆచంటతో కలిసి బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని ఈ సినిమాను నిర్మిస్తున్నారు. టీజర్ రాగానే ఫ్యాన్స్ లో హుషారు పుట్టించేసింది.
హిందూ తత్వం ఉట్టిపడేలా టీజర్‌ను శక్తివంతంగా కట్ చేశారు. బాలయ్య మాస్ ఎనర్జీ, రౌద్రంగా ఉన్న లుక్ అన్ని అంశాలు సంపూర్ణంగా మిళితం చేశారు. మొదటి భాగం ‘అఖండ’కు వచ్చిన విజయంతో పార్ట్-2 పై భారీ అంచనాలు ఉన్నాయి. జార్జియాలో తాజా షెడ్యూల్ పూర్తయినట్టు సమాచారం. దేశవ్యాప్తంగా కొన్ని ముఖ్యమైన ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను సెప్టెంబర్ 25న విడుదల చేయాలన్న లక్ష్యంగా ఉన్నప్పటికీ, రిలీజ్ వాయిదా పడే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది.
More Latest News:
New News Telugu:
థగ్ లైఫ్, షాకింగ్ వీకెండ్ కలెక్షన్లు..
సరికొత్త పాయింట్‌తో ఆది హారర్ థ్రిల్లర్..
More Latest News Telugu: External Sources
అఖండ-2 టీజర్ వచ్చేసింది.. ఫ్యాన్స్ కు పూనకాలే..