ధనుష్‌ కథానాయకుడిగా, నాగార్జున ప్రత్యేక పాత్రలో రూపొందుతోన్న చిత్రం ‘కుబేర’. తెలుగు దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రాన్ని సునీల్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో టాలీవుడ్‌ కింగ్‌ అక్కినేని నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్న నేపథ్యంలో అంచనాలు భారీగా పెరిగాయి. తమిళ ప్రేక్షకులతో పాటు తెలుగు ప్రేక్షకుల్లో కూడా కుబేర సినిమా పై ఆసక్తి భారీగా ఉంది. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని రూపొందిస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. వినాయకచవితి పర్వదినం సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్ట‌ర్‌లో ఒక‌వైపు ధ‌నుష్ ఉండ‌గా, మ‌రోవైపు నాగార్జున ఉన్నారు. ఈ పోస్ట‌ర్‌ను చూడ‌గానే ఆక‌ట్టుకునేలా మేక‌ర్స్ చాలా బాగా డిజైన్ చేశారు. తాజా పోస్టర్‌ తో సినిమాపై అంచనాలు మరింతగా పెరిగాయి.

By admin

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *