జూనియర్ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో వచ్చిన ‘దేవర’ సినిమా ఘనవిజయం సాధించింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సినిమా హిట్ అయిన నేపథ్యంలో నిర్మాతలు సక్సెస్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో ‘దేవర’ టీమ్ తో పాటు ప్రముఖ దర్శకుడు రాజమౌళి, పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కొరటాల శివ మాట్లాడుతూ తాను ఎన్నో సక్సెస్ లు చూశానని, కానీ ఈ సక్సెస్ చాలా స్పెషల్ అని చెప్పారు. చిరంజీవితో చేసిన ‘ఆచార్య’ మూవీ ఫ్లాప్ కావడంతో కొరటాల శివపై ఎన్నో విమర్శలు వచ్చాయి. కొరటాల వల్లే సినిమా ఫెయిల్ అయిందని విమర్శించారు. ఈ నేపథ్యంలోనే, కొరటాల పైవ్యాఖ్యలు చేశారు. ‘దేవర’ హిట్ తో ఆయన తన సత్తాను మరోసారి చాటారు. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడుతూ ఈ సినిమా విజయంతో కొరటాల ముఖంలో సంతోషాన్ని, మనశ్శాంతిని చూస్తున్నానని చెప్పారు.