యువ నటుడు కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన తాజా చిత్రం ‘క’. ఈ మూవీకి సుజిత్, సందీప్ సంయుక్తంగా దర్శకత్వం వహించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. దీపావళి కానుకగా అక్టోబర్ 31న ఈ సినిమా విడుదల కానుంది. దాంతో రిలీజ్ తేదీ దగ్గర పడుతుండడంతో చిత్రం యూనిట్ ప్రచార కార్యక్రమాల్లో జోరు పెంచింది.
దీనిలో భాగంగానే తాజాగా ‘క’ ట్రైలర్‌ను రిలీజ్ చేసింది. ఉత్కంఠకు గురిచేసే సన్నివేశాలతో ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా సాగింది. ఇందులో కిరణ్ అబ్బవరం నటన, సంభాషణలు, యాక్షన్ సన్నివేశాలు సినిమాపై అంచనాలు పెంచేలా ఉన్నాయి. ఈ సినిమాలో కిరణ్ అబ్బవరంకు జోడిగా తన్వీ రామ్ నటించింది.