ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మోస్ట్ క్రేజీయస్ట్ మూవీ పుష్ప-2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా, శ్రీలీల స్పెషల్ సాంగ్‌లో బన్నీ సరసన ఆడిపాడనుంది. మైత్రీ మూవీ మేకర్స్ అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమా ట్రైలర్ ఇటీవలే రికార్డులు బద్దలు కొట్టింది. డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కానుంది.
మరోవైపు ఈ చిత్ర ప్రమోషన్స్ పాన్ ఇండియా వైజ్ గా ప్లాన్ చేసారు మేకర్స్. అందులో భాగంగానే ట్రైలర్ ను బీహార్ లోని పాట్నాలో భారీ స్థాయిలో నిర్వహించి రిలీజ్ చేసారు. ఈ ఈవెంట్ సూపర్ హిట్ కావడంతో మరిన్ని ఈవెంట్స్ ప్లాన్ చేశారు మేకర్స్. ఇక పుష్ప కు తెలుగు రాష్ట్రాల్లో తో పాటు లేదా అంతే స్థాయిలో కేరళలోను క్రేజ్ నెలకొంది. బన్నీ సినిమాలకు మాలీవుడ్ లో మంచి కలెక్షన్స్ వస్తాయ్. ఈ నేపథ్యంలో కేరళ ఫ్యాన్స్ కోసం మేకర్స్ భారీ ఈవెంట్ ను ప్లాన్ చేశారు. కేరళలోని కొచ్చి లో ఈ నవంబరు 27న సాయంత్రం ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప -2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విచేస్తున్నాడు. దీంతో మల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక కేరళలో ఎర్లీ మార్నింగ్ 4.00 గంటల షోస్ తో రిలీజ్ కానున్న ఈ సినిమాను E4 ఎంటర్టైన్మెంట్స్ పంపిణి చేస్తోంది.