అన్‌స్టాపబుల్ తిరుగులేని సీజన్ 4 సూపర్ సక్సెస్‌గా కొనసాగుతోంది. స్టార్ సెలబ్రిటీలతో టాక్ షోలు ఒక రేంజ్ లో సందడి చేస్తున్నాయి. హోస్ట్ గా బాలయ్య ఆట పాటలతో అతిథులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్‌లను ప్రసారం చేసిన ఆహా తాజా ఎపిసోడ్‌ను రెండు భాగాలుగా ప్రసారం చేసింది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఈ నాల్గవ ఎపిసోడ్‌కు హాజరయ్యారు, ఈ నాలుగవ ఎపిసోడ్గా ఆహా టాక్ షోలో ఎన్నడూ రాని వ్యూస్ తో రికార్డు సెట్ చేసింది.
ఇక తాజాగా సీజన్ 4 లోని ఐదవ ఎపిసోడ్ షూట్ ముగించారు అన్‌స్టాపబుల్ మేకర్స్ . ఈ ఎపిసోడ్ కు డాన్సింగ్ డాల్ శ్రీలీల తో పాటు యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోస్ ను ఆహా సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. ఈ స్టేజ్ పై గుంటూరు కారంలోని కుర్చీమడత పెట్టి సాంగ్ కు స్టెప్పులేసిందట. శ్రీలీల డాన్స్ తో పాటు వీణ వాయించడంలోనూ ప్రావిణ్యం కలిగి ఉంది. తన వీణ టాలెంట్ ను అన్‌స్టాపబుల్ స్టేజ్ పై ప్రదర్శించింది. శ్రీలీల టాలెంట్ ను చూసిన అన్‌స్టాపబుల్ కు హజరయిన హోస్ట్ తో పాటు ఆడియన్స్ కూడా అమ్మ శ్రీలీల నీలో మస్త షేడ్స్ ఉన్నాయే అని కితాబు నిస్తున్నారు. వీణ వాయించిన తీరుకు చప్పట్లతో హోరెత్తించారు ఆడియెన్స్. ఈ ఎపిసోడ్ ను వచ్చే వారం రిలీజ్ చేసే ఛాన్స్ ఉంది. శ్రీలీల స్పెషల్ ఎపిసోడ్ ప్రోమో త్వరలోనే విడుదల కానుంది.