బాలీవుడ్ నటి కంగనా రనౌత్ నటించిన తాజా చిత్రం ‘ఎమర్జెన్సీ’. ఈ సినిమా ట్రైలర్ బుధవారం విడుదలైంది. భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ రాజకీయ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్ర‌ధానంగా 1975 నాటి ఎమర్జెన్సీ పరిస్థితుల ఇతివృత్తంగా ఈ చిత్రం రూపుదిద్దుకుంది. ఇందులో ఇందిరా గాంధీ పాత్రలో కంగనా కనిపిస్తారు.

ఈ చిత్రంలో నటించడమే కాకుండా కంగనా స్వయంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది. ఈ చిత్రంలో జయప్రకాశ్ నారాయణ్‌ పాత్రలో సీనియ‌ర్‌ నటుడు అనుపమ్‌ ఖేర్‌, మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ పాత్రలో బాలీవుడ్ నటుడు శ్రేయస్ తల్పడే న‌టించారు. ఇక జీ స్టూడియోస్, మణికర్ణిక ఫిల్మ్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. ఈ చిత్రాన్ని ప్ర‌పంచ‌వ్యాప్తంగా సెప్టెంబర్ 6న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేకర్స్ ప్ర‌క‌టించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *